Jharkhand: జడ్జి దారుణ హత్య..రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

Jharkhand: సీసీటీవీ ఫుటేజీతో దొరికిన దుండగులు * కొట్టేసిన ఆటోతో ఘాతుకం

Update: 2021-07-29 08:51 GMT
జార్ఖండ్ లో జడ్జి హత్య (ఫైల్ ఇమేజ్)

Jharkhand: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన జడ్జిని హత్య చేశారు. ఆతర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌తో దుండగులు అడ్డంగా దొరికిపోయారు.

ధన్‌బాద్ జిల్లా అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్ తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్ కు వెళ్లారు. రోడ్ సైడ్ నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనకనుంచి స్పీడ్ గా వచ్చిన ఆటో ఆయన్ని ఢీ కొట్టింది. అప్పటిదాకా రోడ్డు మధ్యలో వెళ్తున్న ఆటోను ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ తిప్పారు. జడ్జిని ఢీ కొట్టి పరారు అయ్యారు. తీవ్రంగా గాయపడిన జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డుపై పడిపోయారు. ఇది చూసిప స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన గిరిధ్ పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. యాక్సిడెంట్ కాదు.. అది హత్య అని తేలడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆటో దొంగతనం చేసి హత్యకు వాడుకున్నారని పోలీసులు నిర్ధారించారు. జడ్జి ఆనంద్ హత్యను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కేసును సుమోటోగా తీసుకుని విచారించాలని కోరింది. 

Tags:    

Similar News