Delhi sero survey: ఆ వ‌య‌సు వారికే క‌రోనా ముప్పు అధికం.. సీరం స‌ర్వేలో వెల్ల‌డి

Delhi sero survey: కరోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ వ‌ణికిస్తుంది. ఈ మహమ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప‌లు దేశాల శాస్త్ర‌వేతలు, వైద్యులు నిరంత‌రంగా ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు

Update: 2020-08-26 05:39 GMT

కరోనా 

Delhi sero survey: కరోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ వ‌ణికిస్తుంది. ఈ మహమ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప‌లు దేశాల శాస్త్ర‌వేతలు, వైద్యులు నిరంత‌రంగా ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు. వారి కృషి వ‌ల్ల రోజురోజుకూ ఓ కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇటీవ‌ల దేశ రాజధాని ఢిల్లీలో సీరం చేప‌ట్టిన‌ సర్వేలో ఎన్నో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

వైరస్ వ‌ల్ల అత్య‌ధికంగా పిల్లలు, వృద్దులే ప్ర‌భావితం అవుతున్నార‌ని తెలిపింది. ఇందులో ముఖ్యంగా 5 నుంచి 17 ఏండ్ల‌ లోపు వయసు గల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వారిలో 34.7 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని సర్వే ఫలితాలు స్పష్టంచేశాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలోని 28.5 శాతం మందిలో వైరస్‌తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయని స‌ర్వేలో తేలింది.

ఈ నెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ మధ్య మొత్తం 15 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు, 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉన్నారు. మిగిలిన వారు 50 ఏళ్లు పైబడిన వారు.

Tags:    

Similar News