Noise Pollution: ఢిల్లీలో శబ్ధకాలుష్య నివారణకు చర్యలు
Noise Pollution: భారీ జరిమానాలకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం * రూ.వెయ్యి నుంచి లక్ష వరకు జరిమానాలు
Noise Pollution: దేశ రాజధాని ఢిల్లీలో శబ్ద కాలుష్యం నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎవరైనా శబ్ధ కాలుష్యం సృష్టిస్తే లక్షరూపాయల జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఎవరైనా నివాస ప్రాంతాల్లో బాణసంచా కాలిస్తే వెయ్యి రూపాయలు, వాణిజ్య ప్రాంతాల్లో బాణసంచా కాలిస్తే 3వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ర్యాలీలు, వివాహ ఊరేగింపులు, మతపరమైన సమావేశాల సందర్భంగా బాణసంచా కాల్చరాదనే నిబంధనలు ఉల్లంఘిస్తే.. పది వేల నుంచి ఇరవై వేల వరకు జరిమానాలు తప్పవని హెచ్చరించింది. కమిటీ నిర్ణయం ప్రకారం రెండవసారి శబ్ధ కాలుష్యం సృష్టిస్తే 40వేలు జరిమానా పడనుండగా.. ఆ తర్వాత లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు.