ఢిల్లీ కాలుష్యం : వాహనాల నియంత్రణకు కొత్త విధానం.. ఓకే అంటున్న ప్రజలు
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో, వాహనాల రహదారులపైకి నియంత్రించాలని అక్కడ కోసం సరి-బేసి విధానం అమలు చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో, వాహనాల రహదారులపైకి నియంత్రించాలని అక్కడ కోసం సరి-బేసి విధానం అమలు చేశారు. గతంలోనే ఈ నిబంధన ఉన్పటికీ కొన్ని రోజులు మాత్రమే అమలు చేశారు. అయితే కాలుష్యం తీవ్ర స్థాయికీ చేరడంతో తిరిగి దానిని సోమవారం ఉదయం అమలు చేశారు. వాయు కాలుష్యం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఈ విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. సరి-బేసి విధానంలో ద్విచక్రవాహనాలకు, విద్యుత్ తో నడిచే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.
రాష్ట్రపతి, ప్రధాని కాన్వాయ్ తోపాటు మరి కొన్నిటికి ఈ విధానం నుంచి మినహాయింపు ఉంటుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేబినెట్ మంత్రుల వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు లేదు. నవంబర్ 15 వరకూ సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. నగరం మొత్తం కాలుష్యంతో నిడింపోవడంతో ప్రజలు రోగాలు వస్తాయని భయపడుతున్నారు. 40 శాతం మంది మరో నగరం వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సరిబేసి విధానంలో కాలుష్యాన్ని కొంతైనా అదుపుచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పకడ్భందీగా అమలు చేసేందుకు 6వందల పైగా ట్రాఫిక్ పోలీసుల టీంలు రహదారులపై నియమించనున్నారు.