ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించిన రెండు బ్యాగులు

Delhi: ఢిల్లీలో రెండు అనుమానాస్పద బ్యాగులు పోలీసులను పరుగులు పెట్టించాయి.

Update: 2022-01-19 15:16 GMT

ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించిన రెండు బ్యాగులు

Delhi: ఢిల్లీలో రెండు అనుమానాస్పద బ్యాగులు పోలీసులను పరుగులు పెట్టించాయి. త్రిలోక్‌పురి ప్రాంతంలో రెండు అనుమానాస్పద బ్యాగులున్నాయని పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో బాంబ్ స్క్వాడ్ వెంటనే అక్కడికి చేరుకుంది. అనుమానిత బ్యాగులను దూరంగా తరలించి తనిఖీ చేశారు. వాటిలో ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు బ్యాగులను ఎవరో చోరీ చేసి అక్కడ వదిలేసి ఉంటారని తూర్పు ఢిల్లీ డీసీపీ ప్రియాంక కశ్యప్ పేర్కొన్నారు.

Tags:    

Similar News