Delhi: నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
Delhi: దేశ రాజధానిలో ఓ జంట హల్ చల్ చేసింది. మాస్కు ధరించలేదన్నందుకు పోలీసులనే ఎదిరించింది.
Delhi: దేశ రాజధానిలో ఓ జంట హల్ చల్ చేసింది. మాస్కు ధరించలేదన్నందుకు పోలీసులనే ఎదిరించింది. చివరికి భార్యా భర్తలిద్దరూ ఊచలు లెక్కిస్తున్నారిపుడు. కరోనా నిబంధనలు పాటించకుండా కారులో షికారుకు వెళ్లిన ఆ జంటను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. దీంతో ఇద్దరూ రెచ్చిపోయారు. పోలీసులకు దురుసుగా సమాధానమిచ్చారు. నా భర్తకు ముద్దిస్తా... అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యింది ఆ యువతి. ఢిల్లీలోని ధరియాగంజ్లో పోలీసులతో యువ జంట ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.