Delhi: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా మారిన ఢిల్లీ

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరిగిపోయిన కాలుష్యం

Update: 2023-08-30 08:00 GMT

Delhi: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా మారిన ఢిల్లీ

Delhi: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ మారిందని ఓ అధ్యయనం చెబుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ వెల్లడించింది. భారత దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని, కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలు తమ 12 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే అవకాశం ఉందని తేలింది.

భారతదేశంలోని 130 కోట్ల ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన కాలుష్య పరిమితిని దాటిన ప్రాంతాల్లోని నివసిస్తున్నారని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సర్వే తెలిపింది. WHO మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్‌ మాటర్‌ 2.5 క్యూబిక్‌ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. దేశంలో 67.4 శాతం మంది ప్రజలు...అధికంగా ఉన్న కాలుష్య ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపింది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుడి ఆయుర్దాయాన్ని 5.3 ఏళ్లు తగ్గిస్తుందని అధ్యయనం తేల్చింది.

2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సర్వే పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంలో ఢిల్లీ ఉందని, నగరంలోని 18 మిలియన్ల నివాసితులు సగటున 11.9 ఏళ్ల ఆయుర్థాయాన్ని కోల్పోతున్నారని... జాతీయ సూచీలతో పోల్చితే 8.5 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోవడానికి అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ తెలిపింది.

జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 క్యూబిక్‌ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్‌ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది.   

Tags:    

Similar News