కరడుగట్టిన హ్యాకర్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. 53 లక్షల నగదు స్వాధీనం...
Delhi Hacker Arrest: నిందితుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసేవాడు - సీవీ ఆనంద్
Delhi Hacker Arrest: బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన హ్యాకర్ శ్రీరామ్ దినేష్ అరెస్ట్ అయ్యాడు. చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్న హ్యాకర్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడి నుంచి 53 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మొదటిసారి కరడుగట్టిన హాకర్ ను దేశంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. సైబర్ క్రైమ్ స్టేషన్ లో రోజుకు 100కేసులు వస్తే అందులో హ్యాకింగ్ కేసు లు సైతం నమోదు అవుతున్నాయన్నారు. మహేష్ బ్యాంక్ కేసు తరహాలో ఈ హ్యాకింగ్ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారని సీవీ ఆనంద్ అన్నారు.