మందుబాబులకు శుభవార్త.. మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్..
Online Liquor in Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం హోం డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Online Liquor in Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం హోం డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి హోం డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ.. విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వల్ల లాక్‌డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ చట్టాలను సవరించారు. ఢిల్లీ అబ్కారీ శాక ప్రకటన ప్రకారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదు.