Delhi: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కార్ సన్నాహాలు

Delhi: ఢిల్లీ మయపురిలోని ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించిన కేజ్రీవాల్ * చైనా నుంచి 6వేలకు పైగా ఆక్సిజన్ సిలెండర్ల దిగుమతి

Update: 2021-05-24 12:09 GMT

అరవింద్ కేజ్రివాల్ (ఫైల్ ఇమేజ్)

Delhi: కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కార్ సన్నాహకాలు మొదలుపెట్టింది. అక్సిజన్ సిలెండర్ల అందుబాటులో ఉంచడం వంటి ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఢిల్లీ మయపురి ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. థర్డ్ వేవ్ సన్నాహకాల్లో భాగంగా చైనా నుంచి 6వేలకు పైగా ఆక్సిజన్ సిలెండర్లను ఢిల్లీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోందని చెప్పారు.

ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించుకునేందుకు సహకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ, చైనాలోని భారత రాయబార కార్యాలయానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు.. హోం ఐసొలేషన్ ఉన్న వారికి కూడా ఈ సిలెండర్లు అందుబాటులో ఉండేలా చూస్తామని, అవసరమైతే ఈ 6000 ఆక్సిజన్ సిలెండర్ల వినియోగంతో పాటు మరో 3వేల ఆక్సిజన్ బెడ్లు కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News