Union Budget 2021 : ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

Update: 2021-02-01 04:31 GMT

Union Budget 2021 : ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2021-22 ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఉదయం నార్త్‌ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ సైతం ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రసంగం 90 నుంచి 120 నిమిషాలు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సారి బడ్జెట్‌ను మొదటిసారి కాగితం రహితంగా.. డిజిటల్‌ విధానంలో సభ్యులకు పంపిణీ చేయనున్నారు. సాధారణ ప్రజల కోసం పత్రాల కోసం ఇబ్బంది లేకుండా ఈ సారి కేంద్రం మొబైల్‌ యాప్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం కుదించగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 11 శాతం నమోదు చేయగలదని సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా.. బడ్జెట్‌కు ముందు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌, ఆర్థిక బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. కేబినెట్‌ భేటీకి ముందు రాష్ట్రపతిని ఆర్థిక మంత్రి కలిసి, బడ్జెట్‌ మొదటి ప్రతిని అందజేయనున్నారు.




Tags:    

Similar News