దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి అరోపణలు చేసింది. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని.. తన పరువుకు భంగం కలిగించారంటూ అక్బర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. బాధితురాలిపై అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావాను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది.