Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ

Kejriwal: కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

Update: 2024-03-28 03:15 GMT

Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ

Kejriwal: లిక్కర్‌స్కామ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆయనను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 2 వరకు గడువిచ్చింది. దీంతో.. అప్పటివరకు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.

మరో వైపు కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిజ నిజాలను తన భర్త ఇవాళ కోర్టులో బయటపెడతారని చెప్పారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని.. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ అన్ని నిజాలను కోర్టులో వెల్లడిస్తానని కేజ్రీవాల్ చెప్పారని అన్నారు సునీత. లిక్కర్ పాలసీ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని చెప్పడంతో.. ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News