Arvind Kejriwal: నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కేజ్రీవాల్ ప్రశంసల జల్లు
*ప్రస్తుతం సిద్ధూ అణచివేతకు గురౌతున్నారు-కేజ్రీవాల్ *కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు ఆప్‌లో చేరేందుకు సిద్ధం -కేజ్రీవాల్
Arvind Kejriwal: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. ప్రజా సమస్యలపై సిద్ధూ గళాన్ని వినిపిస్తారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. గత ముఖ్యమంత్రితోపాటు ప్రస్తుత సీఎం నుంచి సిద్ధూ అణచివేతకు గురౌతున్నారని అన్నారు. పంజాబ్‌లో పర్యటిస్తున్న కేజ్రీవాల్.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఎంపీలు ఆప్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అయితే ఇతర పార్టీల వారిని తాము చేర్చుకోబోమని తెలిపారు.
పంజాబ్ సీఎంపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఉచిత కరెంట్, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటుపై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చరణ్‌జిత్ సింగ్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇక పంజాబ్ ఆప్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నించడంపైనా అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలకంటే ముందు తాము సీఎం అభ్యర్థిని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు కేజ్రీవాల్.