బిహార్లోని పట్నా ఎయిర్పోర్ట్ బాంబు బెదిరింపు
*దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడు
IndiGo flight: బిహార్లోని పట్నా ఎయిర్పోర్ట్ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని అందర్నీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో వెంటనే అధికారులు విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. హుటాహుటిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నిపుణులు, పోలీసులు విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు తెలిపారు.