Delhi: ప్రమాదకర స్ధాయికి ఢిల్లీ కాలుష్యం, 533కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Delhi - Air Pollution: దేశ రాజధానిలో వాయుకాలుష్యానికి ఊరట లభించడంలేదు....

Update: 2021-11-06 04:06 GMT

Delhi: ప్రమాదకర స్ధాయికి ఢిల్లీ కాలుష్యం, 533కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Delhi - Air Pollution: దేశ రాజధానిలో వాయుకాలుష్యానికి ఊరట లభించడంలేదు. దీపావళి తర్వాత కూడా నగర పొగమంచుతో నిండిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 533కి చేరుకుంది. ఇదే ఐదేళ్లలో అత్యధికం. ఢిల్లీ యూనిర్సిటీలో 580, మధుర రోడ్‌లో 520, IIT-ఢిల్లీలో 548, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 540గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో గాలి నాణ్యతను నమోదు చేశాయి.

దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీ ఆకాశాన్ని పొగమంచు దట్టమైన దుప్పటి కప్పివేసింది. వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజలు గొంతు, దురద, కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలు డిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాని చుట్టు పక్కల రాష్ట్రాల రైతులు వరి పంటల తర్వాత గడ్డిని మొత్తం మంటల్లో వేయడంతో విపరీతమైన కాలుష్యం చోటు చేసుకుంటుంది. అది కూడా చలి కాలం కావడంతో ఈ పరిస్థితి వస్తుంది.

Tags:    

Similar News