DRDO Scientist: పాకిస్తాన్‌కు దేశ రహస్య సమాచారం చేరవేత.. DRDO శాస్త్రవేత్త అరెస్టు
DRDO Scientist: డీఆర్డీఓ శాస్త్రవేత్తకు పాక్ ఐఎస్ఐ ఏజెంట్ వలపు వల.. వాట్సాప్, వీడియో కాల్స్ మాట్లాడినట్టు గుర్తింపు
DRDO Scientist: దాయాది పాకిస్తాన్‌కు రహస్య సమాచారం అందించింనందుకు గాను రక్షణ పరిశోధన సంస్ధ DRDOలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన శాస్త్రవేత్త అరెస్టు అయ్యారు. వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని శాస్త్రవేత్త నిరంతరం చేరవేస్తున్నాడని ఎన్‌ఏఐ ఆరోపించింది. నిరంతరం సదురు దేశంతో టచ్‌లో ఉన్నాడని తెలిపింది. అరెస్ట్ చేసిన శాస్త్రవేత్తను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనను మే 9 వరకూ ఏటీఎస్ కస్టడీలో రిమాండ్‌కు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
డీఆర్డీఓ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశారు. పాక్ ఏజెంట్‌కు ఓ క్షిపణి, దాని స్థావరంతో ఉన్న ఫోటో సహా పలు వ్యక్తిగత ఫోటోలను పంపారు. వీటి సాయంతో పాక్ ఏజెంట్ బ్లాక్ మెయిల్ చేసినట్టు గుర్తించారు. దేశ రక్షణకు సంబంధించిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు అందించినట్టు నిఘా వర్గాలు గుర్తించారు.