Rajnath Singh: రష్యా బయలుదేరిన రాజ్‌నాథ్ సింగ్..

భారత్-చైనా ఉద్రిక్తతల నడుమ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రష్యా బయలుదేరివెళ్లారు. ఈ సందర్బంగా రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి రష్యాతో చర్చలు జరపనున్నారు. అలాగే

Update: 2020-06-22 07:12 GMT

భారత్-చైనా ఉద్రిక్తతల నడుమ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రష్యా బయలుదేరివెళ్లారు. ఈ సందర్బంగా రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి రష్యాతో చర్చలు జరపనున్నారు. అలాగే, ఎస్ -400 ట్రయంఫ్ యాంటీ-క్షిపణి విషయంలో కూడా భారత్ అధికారులతో కలిసి చర్చిస్తారు. ఇక రష్యాలోని మాస్కోలో జరిగే 75 వ విక్టరీ పరేడ్ డేకి కూడా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ ఉన్నారు.

కాగా చైనా, భారతదేశం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన 6 రోజుల తరువాత రాజ్‌నాథ్ ఈ పర్యటన జరుగుతోంది. రష్యా బయలుదేరే ముందు, ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు - రష్యా పర్యటన సందర్భంగా, భారతదేశం మరియు రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. కాగా జూన్ 15 న జరిగిన వాగ్వివాదంలో గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News