కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండేళ్లలో మరణిస్తారా..? మరి నిజమేంటి..!
PIB Fact Check: సోషల్ మీడియాలో వార్తల్లో నిజాల కంటే పుకార్లే ఎక్కువగా ప్రచారం అవుతుంటాయి.
PIB Fact Check: సోషల్ మీడియాలో వార్తల్లో నిజాల కంటే పుకార్లే ఎక్కువగా ప్రచారం అవుతుంటాయి. ఏది పడితే అది షేర్ చేస్తూ.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోకుండా షేర్లు చేస్తుంటారు. పలానా వార్త నిజం కాదని తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా కరోనా వ్యాక్సిన్ పై ఓ వార్త నెట్టింట్లో షికార్లు చేస్తుంది. దేశ ప్రజలను భయపెట్టెలా ఉన్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వాస్తవాలను వెల్లడించాల్సిన పరిస్థితి ఎదురైంది. మరి ఆ వార్తేంటో చూద్దాం..
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ రెండు సంవత్సరాలలో మరణిస్తారని, టీకాల వల్ల కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని, వీటికి ఎలాంటి చికిత్స ఉండదని, టీకాలతోనే ప్రజలు కచ్చితంగా చనిపోతారని నోబెల్ గ్రహీత లుక్ మాంటగ్రైర్ చెప్పాడంటూ.. ఓ వార్త హల్ చల్ చేస్తుంది. దీనిని ఎక్కువ మంది నిజమోనేమో అనుకుంటూ అందరికీ షేర్ చేస్తున్నారు.
బాగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా అందించే వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమని, రెండు సంవత్సరాలలో మరణిస్తారనేది దానిపై ఎలాంటి ఆధారాలు లేవేని, ఈ వార్తలు పూర్తి అవాస్తవమని, ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మకూడదని సూచించింది. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయోద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారకి టీకాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ఫార్వర్డ్ అవుతోంది.