కొవాగ్జిన్‌‌, కోవిషీల్డ్ టీకాల వినియోగానికి డీసీజీఐ అనుమతి

* షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం * టీకాలు రావడం కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు-మోడీ

Update: 2021-01-03 06:56 GMT

Covid Vaccination: కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది.

ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించాయి. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ నుంచి ఈ ప్రకటన రావడం ఊరట కల్పించే అంశం. అంతకుముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీవో సిఫార్సు చేసింది. దానికనుగుణంగా నేడు డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది.

Full View


Tags:    

Similar News