DCGI Approves Oxford Corona Vaccine Clinical Trials : భారత్ లోనూ ఆక్స్ ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్

DCGI Approves Oxford Corona Vaccine Clinical Trials : ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ని తయారుచేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-08-03 09:14 GMT
ప్రతీకాత్మక చిత్రం

DCGI Approves Oxford Corona Vaccine Clinical Trials : ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ని తయారుచేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఈ వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గాను అనుమతిచ్చింది. డీసీజీఐ వి.జి.సొమానీ కరోనా పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఆదివారం రాత్రి ట్రయల్స్‌కు అంగీరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌ఐఐ వెల్లడించింది.

అంతే కాక 'సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్'‌(సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ ముందుగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటి తొలి, రెండో దశ ట్రయల్స్ జరిపిన తరువాత ఫలితాలను విశ్లేషించి ఆ తరువాత భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీంతో 'కొవిషీల్డ్‌' పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు అనుమతి లభించింది. సీఐఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిపాయి. 18 ఏళ్ల వయసు పైబడిన 1600 మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతాల్లో విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ కూడా ఉండడం విశేషం.

ఈ వ్యాక్సిన్‌ను మొత్తం రెండు డోసుల్లో ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి డోసు ఇచ్చిన 29 రోజుల అనంతరం రెండో డోసు ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. దీని ద్వారా వివిధ దశల్లో వ్యాక్సిన్ భద్రత, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి స్పందన తెలుస్తుందన్నారు. మూడో దశకు చేరే ముందే ఈ డ్రగ్ భద్రతకు సంబంధించి 'డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌'(డీఎస్‌ఎంబీ) సమీక్షించిన సమాచారాన్ని సీడీఎస్‌సీవోకు సమర్పించనున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రస్తుతం బ్రిటన్‌లో రెండు, మూడో దశ.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో ఒకటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.


 



Tags:    

Similar News