Inter Results 2023: ఇంటర్ ఫలితాల్లో 600లకు 600 మార్కులు సాధించిన విద్యార్థిని
Inter Results 2023: భవిష్యత్తులో ఆడిటర్ కావాలనేదే తన లక్ష్యమని తెలిపిన విద్యార్ధిని
Inter Results 2023: కృషీ.. పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చాలామంది పూర్తి చేస్తుంటారు. కానీ కొంతమంది పేదరికం వల్ల పై చదువులు చదవలేక మద్యలోనే ఆపేస్తున్నారు. కానీ కొంతమంది ఎంత పేదరికంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కష్టపడి మంచి మార్కులు సంపాదించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అటువంటి అద్భుతాన్ని సృష్టించింది తమిళనాడుకు చెందిన నందిని. తమిళనాడులో సోమవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో దిండిగల్ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ కూతరు ప్రభంజనం సృష్టించింది. నందిని అనే అమ్మాయి అన్ని సబ్జెక్టుల్లో 600లకు 600 మార్కులు సాధించి సత్తా చాటింది.
ఆమెకు తమిళ్, ఇంగ్లీష్, ఎకానామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇలా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ సాధించి సంచలనం సృష్టించింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన నందిని భవిష్యత్తులో ఆడిటర్ కావాలనేదే తన లక్ష్యమని తెలిపింది. తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ. తమిళం, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువమంది విద్యార్థులు వందకు 100 మార్కులు సాధించడం గమనార్హం.