Dasara Special Trains 2020: పండగకి మరిన్ని ప్రత్యేక రైళ్ళు.. వివరాలు ఇవే!
Dasara Special Trains 2020: దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే..
Dasara Special Trains 2020 : దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్–జైపూర్ : సోమవారం, బుధవారల్లో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 25 వరకు.. హైదరాబాద్‌లో రాత్రి 8.35కు బయలుదేరుతుంది.
జైపూర్–హైదరాబాద్ : బుధవారం, శుక్రవారల్లో.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 27 వరకు.. జైపూర్‌లో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్ మీదుగా ప్రయాణిస్తుంది.
విశాఖపట్నం – హజ్రత్ నిజాముద్దీన్: శుక్ర, సోమవారాల్లో.. అక్టోబర్ 23 నుంచి విశాఖలో ఉదయం 8.20కి బయలుదేరుతుంది. వరంగల్, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.
నిజాముద్దీన్–విశాఖపట్నం: బుధవారం, ఆదివారాల్లో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు.. ఢిల్లీలో ఉదయం 5.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
హైదరాబాద్–రాక్సౌల్: ప్రతి గురువారం నడుస్తుంది.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు.. హైదరాబాద్‌లో రాత్రి 11.15కు బయలుదేరుతుంది.
రాక్సౌల్–హైదరాబాద్: ప్రతి ఆదివారం నడుస్తుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు.. రాక్సౌల్‌లో తెల్లవారుజామున 3.25కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.
బరౌనీ–ఎర్నాకుళం: ప్రతి బుధవారం నడుస్తుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 25 వరకు.. బరౌనీలో రాత్రి 10.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
ఎర్నాకుళం–బరౌనీ: అక్టోబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు ఆదివారాల్లో నడుస్తుంది. ఎర్నాకులంలో ఉదయం 10.15కు ప్రారంభమవుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
కాచిగూడ–మైసూరు: అక్టోబర్ 20 నుంచి నవంబర్ 29 వరకు డెయిలీ సర్వీసు. కాచిగూడలో రాత్రి 7.05కు బయలుదేరి మరుసటి ఉదయం 9.30కి మైసూరు చేరుకుంటుంది. తిరిగి మళ్ళీ 21 న మైసూరులో సాయంత్రం 3.15కు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.40కి కాచిగూడ చేరుతుంది. ఇది జడ్చర్ల, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది.