Cyclone Tauktae: ముంచుకొస్తున్న తౌక్టే తుపాను.. కేరళలో రెడ్ అలర్ట్
Cyclone Tauktae: అరేబియా సముంద్రంలో వాయుగుండం ఏర్పడింది. అత్యంత తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది.. తౌక్టే తుపాన్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది.
Cyclone Tauktae: అరేబియా సముంద్రంలో వాయుగుండం ఏర్పడింది. అత్యంత తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది.. తౌక్టే తుపాన్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా 5 రాష్ట్రాలపై పడనుంది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 18న గుజరాత్ సమీపంలోని పోర్బందర్-నలియాల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడుకు తౌక్టే తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే.. కర్నాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే.. కేరళ కొల్లాం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వందలాది చెట్లు నేలకూలాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు భారీగా మోహరించాయి.
ఇక తౌక్టే తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు పడతాయని వెల్లడించింది. ఇక.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది.