కాశ్మీర్ వ్యాలీలో కరెంటు బిల్లుల పంచాయతీ.. మీటర్లను ధ్వంసం చేస్తున్న ముస్లిం ఫ్యామిలీలు
కాశ్మీర్ వ్యాలీలో కరెంటు బిల్లుల పంచాయతీ.. మీటర్లను ధ్వంసం చేస్తున్న ముస్లిం ఫ్యామిలీలు
Jammu and Kashmir: కాశ్మీర్ నుంచి హిందూ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీ చేసి వెళ్లిపోతుంటే అక్కడే ఉంటున్న ముస్లింలు మాత్రం కరెంట్ బిల్లులు చెల్లించేది లేదంటూ నిరసన బాట పట్టారు. ప్రాణ రక్షణ కోసం హిందూ కుటుంబాలు లోయను వీడుతుంటే స్థానిక ముస్లిం కుటుంబాలు తాము విద్యుత్ బిల్లులు చెల్లించబోమంటూ మీటర్లను రోడ్లమీద వేసి ధ్వంసం చేస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇప్పటివరకు ఎవరూ విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. అసలు విద్యుత్ బిల్లులంటే ఏంటనేది కూడా వారికి తెలియదు. అయితే 370 ఆర్టికల్ తొలగించి కాశ్మీర్ ను రాష్ట్రంగా చేశాక అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తోంది. దీనికి ఆగ్రహించిన అక్కడి స్థానికులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు.