CRPF SI Gun Fire On Senior and Self in Delhi: ఇన్‌స్పెక్టర్‌ను కాల్చి చంపిన ఎస్‌ఐ.. ఆపై ఆత్మహత్య
CRPF SI Gun Fire On Senior and Self in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ 122వ బెటాలియన్‌లో కాల్పులు కలకలం రేగింది. ఇన్‌స్పెక్టర్ ను ఎస్‌ఐ కాల్చి చంపారు. అనంతరం ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
CRPF SI Gun Fire On Senior and Self in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ 122వ బెటాలియన్‌లో కాల్పులు కలకలం రేగింది. ఇన్‌స్పెక్టర్ ను ఎస్‌ఐ కాల్చి చంపారు. అనంతరం ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో లోధి ఎస్టేట్ లోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) బంగ్లా వద్ద జరిగింది. కాల్పులకు ముందు ఓ విషయంలో సబ్ ఇన్‌స్పెక్టర్ కర్నాయిల్ సింగ్ (55), ఆయన సీనియర్ ఇన్‌స్పెక్టర్ దశరధ్ సింగ్ (56) మధ్య వాగ్వాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్సై ఇన్స్పెక్టర్ ను తన తుపాకీతో కాల్చాడు, దాంతో ఇన్స్పెక్టర్ అక్కడిక్కడే మరణించారు. ఆ తరువాత ఆ ఎస్సై కూడా తనను తాను కాల్చుకున్నాడని వారు తెలిపారు.
ఎస్‌ఐ జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందినవారు కాగా, ఇన్‌స్పెక్టర్ హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందినవారు. ఈ సంఘటన జరగడంతో పారామిలిటరీ ఫోర్స్, స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందంతో విచారణ నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ సంఘటనతో సీఆర్‌పీఎఫ్ 122వ బెటాలియన్ వద్ద భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఎస్సై వల్లే ఇద్దరు చనిపోయారని తెలుసుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.