National Emblem: పార్లమెంట్‌లోని జాతీయ చిహ్నంపై విమర్శలు
National Emblem: 75 ఏళ్లలో ఎన్నడూ చిహ్నాని మార్చని వైనం
National Emblem: కొత్త పార్లమెంట్ భవనంపై ప్రతిష్ఠించిన జాతీయ చిహ్నం రూపురేఖలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9వేల 500 కిలోల కాంస్యంతో నిర్మించిన 6.5 అడుగుల ఎత్తైన జాతీయ చిహ్నాన్ని రెండ్రోజుల క్రితం ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ జాతీయ చిహ్నం రాజసం ఉట్టిపడేలా ఉండేది. అయితే తాజాగా నిర్మించిన కొత్త చిహ్నం మాత్రం క్రూరత్వానికి గుర్తుగా ఉందంటూ కాంగ్రెస్, ఆర్‌జేడీ, తృణముల్ కాంగ్రెస్ నుంచి విమర్శలు వ్యక్తమతున్నాయి. అయితే జాతీయ చిహ్నం ఎంతో బాగుందని దాన్ని మంచి మనుసుతో చూస్తే మంచిగానే కనబడుతుందని జాతీయ చిహ్నాన్ని రూపొందించిన ముంబై శిల్పి సునీల్ డియోర్ తెలిపారు. ఎందరో ఆర్కిటెక్చర్లతో ప్రభుత్వం చర్చించి దాన్ని రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
జాతీయ చిహ్నం సాధారణంగా మనకు రూపాయి నోట్లపైనా ప్రభుత్వ దస్తావేజులపైనా దర్శనమిస్తుంది. ఈ చిహ్నాన్ని గమనిస్తే మూడు సింహాలు కనిపిస్తాయి. అయితే మొత్తం అందులో నాలుగు సింహాలు ఉంటాయి. ఆ సింహాలు రాచఠీవీని ప్రదర్శిస్తూనే శాంతికి గుర్తుగా ఉంటాయి. అయితే గాంధీ నుంచి గాడ్సే వరకు సింహాలు టీవీ, శాంతియుతంగా ఉన్నాయని అలాంటివి ఈ నాలుగు సింహాలు ఇప్పుడు ఉగ్రరూపంతో ఉన్నాయని ఇదే మోదీ నయా భారత్ అంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ప్రధాని మోడీ ఆవిష్కరించిన సింహాలు అసమానంగా ఉన్నాయని అవి ఆగ్రహంగా చూస్తున్నట్టుగా ఉన్నాయని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ జవహార్ సర్కార్ ఆరోపించారు. జాతీయ చిహ్నంలో సత్యమేవ జయతే ఉంటుందని కొత్న చిహ్నాన్ని చూస్తే సింహమేవజయతే అన్నట్టుగా ఉందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఎద్దేవా చేశారు.
మోడీజీ సారనాథ్‌లోని సింహాల మొహాలను గమనించండి ఆ సింహాలేగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లోక్‌సభ నేత అధిర్ రంజన్ ట్విట్టర్‌లో కోరారు. అమృత్‌కాల్ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్న మోడీ ప్రభుత్వం జాతీయ చిహ్నంలో నరభక్షక సింహాలను ఆవిష్కరించారని ఆర్‌జేడీ విమర్శించింది. అయితే కొత్త పార్లమెంట్ భవనంపై ప్రధాని మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలకు, సారనాథ్ స్థూపంలోని సింహాలకు ఏమాత్రం తేడా లేదంటూ కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ తెలిపారు. జాతీయ చిహ్నానికి సంబంధించిన విమర్శలపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించామన్నారు. కాళీమాతనే అవమానించిన వారికి నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తామంటూ స్మృతి ప్రశ్నించారు.
బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 250లో సారనాత్‌లో శిల్పాన్ని నెలకొల్పాడు. ఆ శిల్పంలో నాలుగు సింహాలు ఒకదానికి ఒకటి వీపులను ఆన్చి గద్దెపై గుండ్రంగా నిల్చు ఉంటాయి. ఆ గెద్దలో ఎద్దు, గుర్రం, ఏనుగు వాటి మధ్య అశోక చక్రాలు ఉంటాయి. కింద సత్యమేవ జయతే అని కూడా రాసి ఉంటుంది. ఇదే శిల్పాన్ని స్వాతంత్రాన్యంతరం కొన్ని మార్పులతో మన జాతీయ చిహ్నంగా మార్చుకున్నాం. బౌద్ధంలో సింహం స్థిర చిత్తానికి, బలానికి, వివేకానికి ప్రతీక. ధర్మాన్ని తెలిపే అశోక చక్రం కూడా ఉంటుంది. అందుకే సారనాథ్ స్థూపాన్ని రాజ్యాంగ నిర్మాతలు దాన్ని జాతీయ చిహ్నంగా 1947 డిసెంబరు 30 గుర్తించారు.