తీర్పులను విమర్శించండి.. తీర్పులనిచ్చే జడ్జిలను కాదు.. జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు
Justice UU Lalit: కోర్టు తీర్పులు వెల్లడించే జడ్జిలను విమర్శించడం తగదన్నారు సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ UU లలిత్.
Justice UU Lalit: కోర్టు తీర్పులు వెల్లడించే జడ్జిలను విమర్శించడం తగదన్నారు సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ UU లలిత్. ఈ నెల 27న ప్రస్తుత CJI NV రమణ నుంచి UU లలిత్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జడ్జిలు కేవలం వారి జడ్జిమెంట్లు, ఆర్డర్ల ద్వారా మాత్రమే మాట్లాడతారని చెప్పారు. కాబట్టి విమర్శలు కేవలం జడ్జిమెంట్లపై మాత్రమే ఉండాలని అన్నారు.
ఎవరైనా సరే జడ్జిమెంట్లను మాత్రమే చూడాలని వాటి వెనుకున్న జడ్జిలను చూడరాదని ఆయన చెప్పారు. జడ్జిమెంట్లపై కౌంటర్ వేసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. జడ్జిలపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోందని వీటిపై జడ్జిలు వెంటనే బదులివ్వరని, దీన్ని బలహీనతగా చూడకూడదని హితవు పలికారు.