కరోనా కాటుకు బలైన సీపీఐ(ఎం) సీనియర్ నేత

తమిళనాడుకు చెందిన సిపిఐ(ఎం) సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) క‌రోనా కాటుకు బలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తంగవేలు ఆదివారం..

Update: 2020-09-14 08:28 GMT

తమిళనాడుకు చెందిన సిపిఐ(ఎం) సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) క‌రోనా కాటుకు బలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తంగవేలు ఆదివారం ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 తో మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 15 రోజుల కిందట తంగవేలుకు కరోనా సోకింది. దాంతో మొదట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు.. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో ఆయన శరీరం కూడా చికిత్సకు స్పందించలేదు. దాంతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. 2011-16లో తిరుపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. బనియన్ మిల్లు కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన తంగ‌వేలు వివిధ కార్మిక సంఘాల‌లో ప‌నిచేశారు. ఆ తరువాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు.

ప్రస్తుతం సిపిఐ(ఎం) పార్టీ కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగాను ఉన్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా సుమారు 25 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందించిన ఆయ‌న కార్మిక ‌హ‌క్కులు, సరైన వేతనాల కోసం యాజమాన్యాలపై అనేక పోరాటాలు చేశారు. ఆయనకు కార్మికుల పక్షపాతిగా పేరుంది. కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలోనే కాక ఎమ్మెల్యే అయ్యాక కూడా కార్మికు హక్కుల కోసం పోరాడేవారు. తంగవేలు మృతిపట్ల పలువురు నేత‌లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలియజేశారు. మరోవైపు తంగవేలు మరణం పట్ల మూడు రోజులపాటు సంతాప‌దినాలు నిర్వ‌హించాల‌ని సీపీఐ(ఎం) నిర్ణ‌యించింది. గౌర‌వ చిహ్నంగా పార్టీ జెండాను మూడు రోజులపాటు అవ‌త‌నం చేస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు తెలియజేశారు.    

Tags:    

Similar News