Cowin Portal: తెలుగులోనూ కోవిన్ పోర్టల్

Cowin Portal: కోవిన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

Update: 2021-06-04 04:53 GMT

Cowin Portal:(File Image)

Cowin Portal: వ్యాక్సినేషన్ కోసం పేరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక ఇబ్బందులు పడాల్సిన పని లేదు. చాలామంది అది హిందీలో ఉండటం వలన ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. ఇప్పుడా సమస్య లేకుండా ప్రాంతీయ భాషల్లో కోవిన్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. అంటే మన తెలుగులోనే అన్ని వివరాలు ఉంటాయి.. మన వివరాలు కూడా తెలుగులోనే నింపి.. వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఐతే టీకా వేసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్‌లో ఎంతో కీలమైన ఈ పోర్టల్ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు మరింత ఈజీ కానున్నాయి. కోవిన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

ప్రాంతీయ భాషల్లోనూ కోవిన్ పోర్టల్ అందుబాటులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల వారికి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటివి మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో టీకాల కొరత నెలకొంది. మొదటి డోస్ వేసుకున్న వారికి కూడా రెండో డోస్ దొరకడం లేదు. 18 ఏళ్లు నిండిన వారికి చాలా చోట్ల వ్యాక్సినేషన్ జరగడం లేదు. కానీ సూపర్ స్పైడర్స్ గా గుర్తించిన వారికి వాక్సిన్ వేసే ప్రక్రియలు స్వీడుగానే జరుగుతోంది.

Tags:    

Similar News