Covishield: కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు పై అధ్యయనం!

Covishield: కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు పై కమిటీ నియమించిన కేంద్రం

Update: 2021-05-08 07:59 GMT
కోవిషిల్డ్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covishield: కరోనా టీకాల రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే విషయం పై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌తో పాటుగా ఆస్ట్రాజెనెకా-సీరం రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సీన్లను ప్రభుత్వలే అందిస్తున్నాయి. ఈ రెండు టీకాలూ 'డబుల్ షాట్స్(రెండు డోసుల)' విధానంలో అభివృద్ధి చేసినవి కావడంతో.. తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య నాలుగు వారాల గ్యాప్ ఇస్తూ టీకాలను అందజేస్తున్నారు.

కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే దాని సామర్థ్యం కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకలు తెలిపిన నేపథ్యంలో దాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అన్న విషయాలను విశ్లేషించి వచ్చే వారమే నివేదిక సమర్పించే అవకాశం వుంది. కోవీషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలనే జరిపిన పరిశోదనను లాన్సెట్ జర్నల్ ఈ డాది మార్చి నెలలో ప్రచురించింది. దాని ప్రకారంరెండు డోసుల మధ్య వ్యవధి ఆరు వారాలు ఉంటే టీకా సామర్థ్యం 55.1శాతంగా ఉంటుంది. అదే వ్యవధి 12 వారాలకు పెంచితే సామర్థ్యం 81.3శాతం పెరుగుతుంది. ఇదే టీకాను ఉపయోగిస్తున్న కెనడాలో 12 వారాలు, బ్రిటన్ లో 16 వారాల విరామాన్ని అమలు చేస్తున్నారు. వ్యవధి పెరిగే కొద్దీ సామర్ధ్యం కూడా పెరుగుతున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News