ఇంట్లోనే కరోనా టెస్ట్..అందుబాటులోకి టెస్టింగ్ కిట్.. ధర రూ.250

CoviSelf: ఇకనుంచి కోవిడ టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు.

Update: 2021-05-20 11:56 GMT

కోవిసెల్ఫ్ (ఫొటో ట్విట్టర్)

CoviSelf: ఇకనుంచి కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. కారణం, వచ్చే వారంలో కరోనా టెస్టింగ్ కిట్‌ అందుబాటులోకి రానుంది. ఈ కిట్ తో మీ ఇంట్లోనే కోవిడ్ టెస్టు చేసుకోవచ్చంట. టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశలో కేంద్రం అడుగులు వేసిన నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా టెస్టింగ్ కిట్ ను తక్కువ ధరలోనే మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (RAT)ధరను రూ.250గా మాత్రమే. ఈ కిట్ తో కేవలం 15 నిమిషాల్లో కరోనా వైరస్ సోకిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.

పూణేకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఈ కిట్ ను రూపొందించింది. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు ఈ టెస్టింగ్ కిట్‌ను వినియోగించుకోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. వారం రోజుల్లో ఈ కిట్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో టెస్టింగ్ కోసం బారులు తీరాల్సిన అవసరం లేకుండా.. హాయిగా ఇంట్లోనే పరిక్షించుకోవచ్చు.


Full View

Tags:    

Similar News