Covid19 Vaccine Latest Updates: కళ్ల ముందు కరోనా మందు.. ఏది ముందు.. ఎవరిది ముందు !

Covid19 Vaccine Updates: కరోనా వైరస్ ఇక మనల్నేం చేయలేదులే అనే ధైర్యం ప్రజల్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓ రెండు మూడు రోజులుగా ఈ వ్యాధి చికిత్సకు కొత్త మందుల పేర్లు వినిపిస్తున్నాయి.

Update: 2020-06-26 09:52 GMT

Covid19 Vaccine latest Updates: కరోనా వైరస్ ఇక మనల్నేం చేయలేదులే అనే ధైర్యం ప్రజల్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓ రెండు మూడు రోజులుగా ఈ వ్యాధి చికిత్సకు కొత్త మందుల పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపున వాక్సీన్ కు సంబంధించి సైతం ఆశలు రేకెత్తించేలా కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. కాకపోతే వీటిలో నిజమెంత అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అల్లోపతి అని కొందరు, ఆయుర్వేదమని మరికొందరు, హోమియోపతి అని ఇంకొందరు. మరి ఎవరి వాదనలో నిజం ఎంత? ఎవరి మందులో పవర్‌ ఎంత?

కళ్ల ముందు కరోనా మందు. ఏది ముందు... ఎవరిది ముందు. అల్లోపతా నివారిస్తుందా? ఆయుర్వేదం అడ్డుకట్ట వేస్తుందా? కరోనాను తగ్గించే పవర్‌ హోమియోకు ఉందా?

ఎవరిది ముందైనా.... ఎవరిది మందైనా కరోనా వ్యాధిగ్రస్తుల్లో మాత్రం ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణ ప్రజల్లో ధైర్యం పెరిగిపోతోంది. పలు కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లోకి కొత్త ఔషధాలను ప్రవేశపెడుతున్నాయి. మరెన్నో కంపెనీలు తమ ఉత్పాదనలను మార్కెట్లోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకురావడంతో భరోసా మరింతగా కనిపిస్తోంది. కోరోనిల్ పేరుతో మార్కెట్‌లో మందు రెడీ అవడంతో దీని ద్వారా కరోనాను నయం చేయొచ్చన్నది రామ్‌దేవ్‌బాబా మాట. మూడు రోజుల్లో ఈ మందుతో కోలుకుంటారని పతంజలి బలంగా చెబుతోంది.

అటు-కరోనాను కట్టడి చేసే రెమిడిసివిర్ ఔషదాన్ని కోవిఫర్ ఇంజక్షన్‌ను విడుదల చేయనున్నట్లు ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ చెబుతోంది. ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇంజెక్షన్లను లక్ష డోసుల మేర సిద్ధం చేసినట్లు సంస్థ ప్రకటించింది. బ‌ల‌మైన ఇంటిగ్రేష‌న్ సామ‌ర్థ్యాల‌ను క‌లిగి ఉండ‌టంతో ఈ మెడిసిన్ ఉత్పత్తి దేశ‌వ్యాప్తంగా వెంట‌నే రోగుల‌కు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని హెటిరో అభిప్రాయపడింది.

ఏమైనా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈలోగా చికిత్సకు మాత్రం కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొత్త ఔషధాల రాకతో సాధారణ ప్రజానీకంలో పలు సందేహాలు కూడా మొదలవుతున్నాయి. కొత్త మందుల ప్రభావమెంత వాటితో తలెత్తే సైడ్ ఎఫెక్ట్‌ల సంగతేంటి ధర తగ్గే అవకాశం ఉందా లేదా లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కరోనా చికిత్సకు కొత్త మందులు రావడం శుభసూచకమే. కాకపోతే వాటిపై మరిన్ని అధ్యయనాలు కూడా జరగాల్సి ఉంది. మందులున్నాయి కదా అని ముందు జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయలేం. ఓ వ్యక్తి మరణం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అందుకే కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసే వరకూ ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే.

Tags:    

Similar News