COVID-19 Tests In India : ముమ్మరంగా కరోనా టెస్టులు

COVID-19 Tests In India : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు మాత్రం చాలా అత్యల్పంగా ఉందని

Update: 2020-08-04 13:11 GMT
Rajesh Bhushan

COVID-19 Tests In India : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు మాత్రం చాలా అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ మరణాల రేటు 2.10 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాధితో పోరాడి పెద్దసంఖ్యలో రోగులు కోలుకుంటున్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మంగళవారం మీడియాకి వెల్లడించారు..

ఇక రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు టెస్టులును పెంచుతున్నాయని, గడిచిన 24 గంటల్లో 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసినట్టుగా వెల్లడించారు.. తాజా టెస్టులతో కలిపి ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా టెస్టులు జరిగాయని వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 66.31 గా ఉందని వెల్లడించారు. ఇక కరోనా మరణాల్లో 50 శాతం 60 ఏళ్ల వయసుపైబడిన వారే ఉన్నారని, 45-60 ఏళ్లలోపు వారు 37 శాతం ఉన్నట్టుగా స్పష్టం చేశారు.

ఇక భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,050 కేసులు నమోదు కాగా, 803 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 44,306 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,55,745 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,86,298 ఉండగా, 12,30,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,938 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Tags:    

Similar News