గతవారం కోవిడ్ పాజిటివ్ : జ్వరంతో ఆసుపత్రిలో చేరిన మనీష్ సిసోడియా
గత వారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కరోనావైరస్ భారిన పడ్డారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాజాగా జ్వరం వచ్చింది.
గత వారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కరోనావైరస్ భారిన పడ్డారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాజాగా తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో డిప్యూటీ సిఎం చెక్ అప్ కోసం దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు చెప్పారు. మనీష్ సిసోడియాకు సెప్టెంబర్ 14 న కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అప్పుడు తనకు జ్వరం లేదని, ఐసోలేషన్ లోకి వెళ్తున్నానని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.. అందులో ఇలా పేర్కొన్నారు..
'నాకు తేలికపాటి జ్వరం వచ్చిన తరువాత నా కోవిడ్ -19 పరీక్ష జరిగింది. నివేదిక సానుకూలంగా వచ్చింది. నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాను. ప్రస్తుతానికి, నాకు జ్వరం లేదా మరే ఇతర సమస్య లేదు. నేను బాగున్నాను. మీ ఆశీర్వాదం ద్వారా, నేను పూర్తిగా కోలుకొని త్వరలో వర్క్ లోకి వస్తాను' అని మనీష్ సిసోడియా హిందీలో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కరోనా సోకిన మంత్రులలో మనీష్ సిసోడియా రెండవ మంత్రి. జూన్లో, ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.