దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ కలకలం

*ఇప్పటివరకు 5 కేసులు నమోదు

Update: 2023-01-04 02:31 GMT

దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ కలకలం

India: దేశంలో కరోని కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. అమెరికా, ఇంగ్లాండ్‌లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమైన కరోనా వైరస్‌ ఉప రకం X BB 1.5.. భారత్‌లోనూ వెలుగుచూసింది. దేశంలో ఇప్పటివరకు 5 కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌లో మూడు, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్‌కు చెందిన సబ్​వేరియంట్ X BB 1.5 అమెరికాలో 40.5 శాతం కేసులు పెరగడానికి కారణమైంది. ఇంగ్లాండ్‌, న్యూయార్క్‌లో ఏకంగా 75 శాతం కేసులు పెరగడానికి ఈ వైరస్‌ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. BA.2 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ నుంచి X BB పుట్టుకొచ్చినట్లు వివరిస్తున్నారు. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి X BB సబ్‌ వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే X BB 1.5 వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కేసులు పెరిగినప్పటికీ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News