Covid effect : భారతదేశం అంతటా 1,000 పాఠశాలలు అమ్మకానికి..
కోవిడ్ మహమ్మారి భారతీయ విద్యారంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో రాబోయే రెండు-మూడేళ్ళలో 7,500 కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకోవాలని..
కోవిడ్ మహమ్మారి భారతీయ విద్యారంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో రాబోయే రెండు-మూడేళ్ళలో 7,500 కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకోవాలని భావిస్తున్న1,000 కేజీ టు 12వ తరగతి పాఠశాలలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఖర్చులు, మైంటెన్స్ భరించలేక అమ్మకానికిపెట్టినట్టు ఓ సర్వే వెల్లడించింది. ఇందులో 50,000 రూపాయల వార్షిక రుసుము కలిగిన ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయని.. సెరెస్ట్రా వెంచర్స్ అనే సంస్థ తెలిపింది. పాఠశాలలు.. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించి స్థితిలో లేవు , అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు వసూలుపై పరిమితులు విధించాయి. దీంతో విద్యాసంస్థలను నడపడం మరింత కష్టతరంగా మారిందని సెరెస్ట్రా భాగస్వామి అయిన విశాల్ గోయెల్ అన్నారు. ఎక్కువ బ్రాంచులు కలిగిన విద్యాసంస్థలు బోధనేతర సిబ్బందికి జీతాలను 70 శాతం వరకు తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థలు పాటశాలలను నడపడానికి రుణాలు కూడా ఇవ్వడం లేదు, దానికి తోడు ప్రస్తుత పరిస్థితి ఎప్పుడు? ఎలా తొలగిపోతుందనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల నిధులు సమకూర్చడం కష్టమైంది. దాంతో విద్యాసంస్థలు తీవ్ర సంకోభంలో ఇరుక్కుపోయాయని అన్నారాయన. గోయెల్ అనే సంస్థకు 30 నుండి 40 కెజి-క్లాస్ 12 పాఠశాలలు ఉన్నాయి, అయితే ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో స్కూళ్లను భవిషత్ లో నడపడానికి దాదాపు 1,400 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆశిస్తోంది..
మరోవైపు నాణ్యమైన విద్యను అందించడానికి.. బలమైన వ్యూహాత్మకమైన లక్ష్యంతో యూరోకిడ్స్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థను స్థాపించమని చెబుతున్నారు ఆ సహ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ సిఇఒ అయిన ప్రజోద్ రాజన్.. ఈ గ్రూపుకు 30 కి పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే ఈ సంస్థ కూడా ప్రస్తుతం సంక్షోభంతో పోరాడుతోందని ప్రజోద్ రాజన్ అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ మరియు తెలంగాణలో తమకు 20 నుండి 25 పాఠశాలలు ఉన్నాయని.. వాటిని అమ్మడం గురించి ఆలోచిస్తున్నామని లోస్ట్రో అడ్వైజర్స్ భాగస్వామి రాకేశ్ గుప్తా అన్నారు. గత సంవత్సరం, హాంకాంగ్ కు చెందిన నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ భారతదేశంలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ నుండి పాఠశాలల సమూహాన్ని కొనుగోలు చేసింది. వీటిలో హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మరియు మొహాలిలోని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలను రూ .1,600 కోట్లకు కొన్నారు. కానీ ఇప్పుడు ఇవే పాఠశాలలను విక్రయించాలంటే మాత్రం 30 నుండి 40 శాతం తక్కువకు అడుగుతున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారి ప్రైవేటు విద్య సంస్థలపై పగబట్టిందని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.