దేశంలో అమాంతంగా పెరుగుతున్న కరోనా.. ఒక్క రోజే 752 కేసులు
Corona Cases In India: ఎన్.1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని..తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నదని పేర్కొన్న WHO
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3వేల 420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్త కేసులు న్యూఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణలో నమోదయ్యాయి. క్రిస్‌మస్ పండగ తరుణంలో దేశంలో జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది.
గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు 52 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నెల రోజుల్లో 8లక్షల 50వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. లక్ష 18వేల మంది కొవిడ్ వల్ల ఆసుపత్రిలో చేరారని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు జేఎన్.1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని, తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. కొవిడ్‌తో పాటు ఫ్లూ, పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేయించుకోవాలని ప్రజలకు సూచించింది.
నమోదైన కేసుల్లో 12 హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది.
తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది.జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదని డాక్టర్ల బృందం అభిప్రాయపడింది.