Varavara Rao Shifted to Nanavati Hospital: వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
Varavara Rao shifted to Nanavati Hospital: కవి, విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు, ఎల్గర్ పరిషత్ కేసు నిందితుడు వరవరరావు (80) ను ఆదివారం నాడీ మరియు యూరాలజికల్ చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించినట్లు ఒక అధికారి తెలిపారు
Varavara Rao shifted to Nanavati hospital: కవి, విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు, ఎల్గర్ పరిషత్ కేసు నిందితుడు వరవరరావు (80) ను ఆదివారం నాడీ మరియు యూరాలజికల్ చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించినట్లు ఒక అధికారి తెలిపారు. కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన వరవరరావు గురువారం నుంచి దక్షిణ ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. COVID-19 చికిత్స సమయంలో, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు గుర్తించారు, కానీ ఆయనకు నాడీ సంబంధిత సమస్యలు ఉన్నాయని గమనించారు. జెజె ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్టులు శుక్రవారం ఆయనను పరీక్షించగా.. మతిమరుపు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆయనకు ప్రస్తుతం న్యూరోలాజికల్ మరియు యూరాలజికల్ చికిత్స అవసరం అని, అందుకే వరవరరావును ఆదివారం తెల్లవారుజామున నానావతి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన COVID-19 చికిత్సకు బాగా స్పందించాడని.. అప్పుడు వరవరరావు ఛాతీ ఎక్స్-రే , ECG సాధారణమైనవిగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా.. మహారాష్ట్రలోని తలోజా జైలులో భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా వరవరరావు ఏడాదిన్నరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఆయనకు జరిపిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్న రావును అతని కుటుంబ సభ్యులు మరియు పలువురు రచయితలు , కార్యకర్తలు ఆయనకు చికిత్స అవసరమని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత జెజె ఆసుపత్రిలో చేర్చారు.