Actor Sells Vegetables In Odisha: కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు
Actor Sells Vegetables In Odisha: కరోనా రావడంతో అందరి జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయి. రోజూ కూలి చేసుకునే వారి పరిస్థితి అయితే వేరే చెప్పనక్కర్లేదు.
Actor Sells Vegetables In Odisha: కరోనా రావడంతో అందరి జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయి. రోజూ కూలి చేసుకునే వారి పరిస్థితి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఎంతో మంది పనుల్లేక ఇళ్లవద్దే ఉంటూ కూరగాయలు, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ కరోనా వైరస్ బాధకు ఎవరూ ఇల్లు దాటి బయటికి రావడం లేదు. దాంతో సినిమా ఇండస్ట్రీ కూడా కోట్లకు కోట్లు నష్టపోతుంది. జూనియర్ ఆర్టిస్టులతో పాటు ఇతర నటీనటులు సినిమా షూటింగులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీపరిశ్రమ దాదాపుగా మూత పడిన పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన బాలీవుడ్ నటుడు కార్తికా సాహూ బ్రతుకీడ్చడానికి కూరగాయల వ్యాపారాన్ని నమ్ముకున్నాడు.. సినిమాల్లో వేలకు వేలు సంపాదించే సాహు ఇల్లు ఇల్లు తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఒడిశా కేంద్రాపాడ జిల్లాలోని గరద్పూర్‌కు చెందిన సాహూ 17 సంవత్సరాల వయసులో 2014లో బాలీవుడ్‌లో నటించడానికి ముంబై వెళ్ళాడు. మొదట్లో సినిమా ఛాన్సులు రాకపోవడంతో కొన్నాళ్లు బాడీగార్డ్‌గా పనిచేశాడు.. అందులో అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులకు కూడా బాడీగార్డ్‌గా చేశారు. అయితే 2018 నుంచి అవకాశాలు వస్తున్నాయి.. అడపా దడపా సినిమాల్లో నటించారు. కానీ ఇంతలోనే కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు. దీంతో చేసేదేమి లేక ఒడిశాలోని ఇంటికి చేరుకున్నాడు.. గత మూడు నెలలుగా కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టిన తరువాతే మళ్ళీ సినిమాల్లోకి వెళతానని చెప్పారు.