జూన్‌లో కరోనా ఫోర్త్ వేవ్.. కీలక ప్రకటన చేసిన ఐఐటీ కాన్పూర్..

Covid-19 Fourth Wave in India: దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ దాదాపుగా తగ్గిపోయింది.

Update: 2022-02-28 02:18 GMT

జూన్‌లో కరోనా ఫోర్త్ వేవ్.. కీలక ప్రకటన చేసిన ఐఐటీ కాన్పూర్..

Covid-19 Fourth Wave in India: దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ దాదాపుగా తగ్గిపోయింది. కొత్త కేసులు, మరణాలు కూడా తగ్గడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాబోయే వేసవిలో మరో విలయం మనకోసం కాచుకుని ఉందంటూ ఐఐటీ కాన్పూర్‌ మరో బాంబ్ పేల్చింది. జూన్‌లో దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ తలెత్తనుందని హెచ్చరించింది. కరోనా నాలుగో విడత జూన్ 22 నాటికి విరుచుకుపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది అక్టోబర్ 24 వరకు కొనసాగుతుందన్నది వారి విశ్లేషణ.

అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని అంటున్నారు. వీరి అంచనాలు మెడిరిక్స్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా నాలుగో విడత వస్తే కనీసం నాలుగు నెలల పాటు ఉంటుందని ఆగస్ట్ 15 నుంచి 31 మధ్య కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు.

గత మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్‌ కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. కొద్ది రోజుల పాటే ఉంటుందని వారు ముందుగా అంచనా వేసినట్టుగానే ఒమిక్రాన్ రెండు నెలల్లోనే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అలసత్వం వహించొద్దని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News