Tamil Nadu: తమిళనాడు పళని ఆలయంలోకి ప్రవేశంపై కోర్టు కీలక తీర్పు

Tamil Nadu: అన్యమతస్థులకు ఆలయ ప్రవేశం లేదన్న కోర్టు

Update: 2023-08-03 07:55 GMT

Tamil Nadu: తమిళనాడు పళని ఆలయంలోకి ప్రవేశంపై కోర్టు కీలక తీర్పు

Tamil Nadu: తమిళనాడు పళని మురుగన్‌ ఆలయంలోకి ప్రవేశంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. హిందువులు కాని వారికి ఆలయంలోకి ప్రవేశం లేదని తీర్పులో పేర్కొంది. అన్యమతస్తులకు ఆలయంలోకి ప్రవేశం లేదన్న బోర్డు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటైన పళని పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. గతంలో ఏర్పాటు చేసిన బోర్డును అకస్మాత్తుగా తొలగించడంపై పళనివాసి సెంథిల్‌ కుమార్‌ కోర్టు మెట్లెక్కాడు. దీంతో హిందువులు కాని వారికి ఆలయంలోకి ప్రవేశం లేదన్న బోర్డు ఏర్పాటు చేయాలన్న కోర్టు తాజా ఉత్తర్వులతో మళ్లీ చర్చనీయాంశమయ్యింది

Tags:    

Similar News