5 States Elections: ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు

5 States Elections: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలి ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది.

Update: 2021-05-02 04:43 GMT

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 

5 States Elections: దేశం అంతా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలి ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.

5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా… పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే కేరళలో 633, అసోంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరిగాయి.

తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 234 స్థానాలున్నతమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకుంది. ఇక్కడ వరుసగా మూడోసారి అధికారం కోసం అన్నాడీఎంకే, పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే పోటా పోటీగా ప్రచారం నిర్వహించాయి. వివిధ వార్త సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈసారి తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు కనిపించింది. ఏఐడీఎంకేను కాదని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కు తమిళ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వేలు నివేదించాయి.

140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. 73.58శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 140 స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ జరిగింది. దేవభూమిగా పేరొందిన కేరళలో ఎర్రజెండా మరోమారు రెపరెపలాడనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తుందని కొందరు.. స్వల్ప మెజారిటీతో బయటపడుతుందని మరికొన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. శబరిమల వివాదం, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన బీజేపీ నిరాశే ఎదురవుతుందని విశ్లేషణలు అంటున్నారు. ఇక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు..

అటు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముమ్మర ప్రచారం చేశాయి. అయితే, సౌత్‌లో కమలదళం పాగా వేయనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ప్రభంజనం కొనసాగినా పుదుచ్చేరిలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News