Oxford Covid19 Vaccine: శుభవార్త : ఆగస్టు చివరి నాటికి కరోనాకు వ్యాక్సిన్..

Update: 2020-07-24 09:00 GMT

Oxford Covid19 Vaccine:ప్రపంచానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త అందించింది. ఆగస్టు చివరినాకికి కరోనా వ్యాక్సిన్ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. తుదిదశ పరీక్షల్లో కరోనా టీకా ఉందని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ను మూడు మిలియన్ల మోతాదులో తయారు చేసే యోచనలో సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఉంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా భాగస్వామిగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లను తయారుచేసే సామర్ధ్యం ఉన్న సంస్థగా సీరం ఇన్స్టిట్యూట్ కు పేరుంది. కరోనాకు వ్యాక్సిన్ రెడీ అవ్వగానే ఇండియాలో పనులు మొదలు పెట్టాలని సీరం ఇన్స్టిట్యూట్ నిర్ణయించింది.

 సీరం లో తయారుచేసే వ్యాక్సిన్ దీని ధర ఎంత ఉంటుందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా స్వయంగా ధర విషయంలో ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ధర వేయి రూపాయల వరకూ ఉంటుందని..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే సామూహిక ఇమ్యునైజేషన్ కింద ఉచితంగా అందించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని ఇప్పటినుంచే రెడీ చేసుకుంటుంది. కొద్దిరోజుల కిందట సీరం ఇన్స్టిట్యూట్ ను పనితీరును ప్రశంసించారు మైక్రోసాఫ్ట్ అధినేత. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఒక్క భారత్ కే ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత అన్నారు.

Tags:    

Similar News