Coronavirus updates in Tamilnadu: తమిళనాటలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus updates in Tamilnadu: త‌మిళనాట క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. నేటితో ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును క్రాస్ అయ్యింది.

Update: 2020-07-25 15:39 GMT
Representational Image

Coronavirus updates in Tamilnadu: త‌మిళనాడులో క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. నేటితో  ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును క్రాస్ అయ్యింది. ప్ర‌తిరోజూ వేల‌లో కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌జలు భ‌యాందోళ‌న‌తో బెంబేలెత్తున్నారు. తాజా నివేదిక ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,988 కరోనా కేసులు నమోదుకాగా 89 మంది మరణించారు. 7,758 మంది క‌రోనాను జ‌యించి.. డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,737కి చేరింది. వీరిలో 52,273 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1,51,055 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ 3,409మంది మరణించారు. ఇదిలా ఉంటే నేడు 64,315 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 22,87,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు పేర్కోన్నారు. 

మ‌రోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. 12 లక్షల మార్కును దాటిన రెండు రోజుల్లోనే కేసులు 13 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 13,36,861కి చేరింది. వీరిలో వివిధ ఆస్ప‌త్రిలో 4,56,071 మంది చికిత్స పొందుతున్నారు. 8,49,432 మంది క‌రోనా ను జ‌యించి.. ఇండ్లకు చేరుకున్నారు. కానీ కొత్తగా 757 మంది వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31,358కి పెరిగింది. దేశంలో వరుసగా మూడో రోజు కూడా 45 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.  నిన్న ఒక్కరోజే 42,0898 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్కరోజే 34,602 మంది కరోనా జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

  

Tags:    

Similar News