Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 34,956 కేసులు నమోదు కాగా, 687 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 10,03,832 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,42,473 ఉండగా, 6,35,756 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 25,602 మంది కరోనా వ్యాధితో మరణించారు. గురువారం దేశవ్యాప్తంగా 3,33,228 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1,30,72,718 కరోనా టెస్ట్‌లు చేసినట్లు వెల్లడించింది. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 63శాతం రికవరీ రేటు ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.