దేశంలో కొత్తగా 86,961 కరోనా కేసులు!
Coronavirus Updates In India : కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలలో నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా
Coronavirus Updates In India : కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలలో నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 86,961 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనితో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 54,87,581కి పెరిగింది. అయితే ఇందులో 10,03,299 మంది చికిత్స తీసుకుంటుండగా 43,96,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 79.68శాతం ఉండగా, మరణాల రేటు 1.61శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 1,130 మంది కరోనాతో మరణించారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 87,882కు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 7,31,534 టెస్టులు జరగగా మొత్తం టెస్టుల సంఖ్య 6,43,92,594కి చేరింది. అయితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండం సంతోషించదగ్గ విషయం.. అటు ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకుంటున్నవారు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇటివల వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటేపాజిటివ్ కేసుల సంఖ్య 3కోట్లు దాటగా వారిలో ఇప్పటికే 2కోట్ల 20లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు.