దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు!
coronavirus Update In India : దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
Coronavirus Update In India : దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 10,28,622 నమూనాలను పరీక్షించగా..63,371 మందికి పాజిటివ్ గా అని తేలింది. ఇక తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 73,70,469కి చేరుకుంది. ఇందులో 8,04,528 యాక్టివ్ కేసులు ఉండగా, 64,53,779 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇక నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో మరో 895 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469గా నమోదైంది.
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,22,54,927 నమూనాలను పరీక్షించారు! కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతే స్థాయిలో డిశ్ఛార్జి అయ్యే సంఖ్య ఉండడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు..దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉండగా, మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది!