Coronavirus Updates in India: భారత్ లో విజృంభిస్తున్న "కరోనా" .
Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 14 లక్షల 35 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,931కేసులు నమోదు కాగా, 708 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 31,992 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 14,35,453 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,85,11 ఉండగా, 9,17,568 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 32,771 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 9,431 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్రలో 3,75,799 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ మహారాష్ట్రలో మరో 267 మంది ప్రాణాలు తీసుకుందని, రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,656 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. ఈ ధోరణి ఆదివారం కూడా కొనసాగింది. కొత్తగా 1075 కేసులు మాత్రమే నమోదయ్యాయి..