Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 29,429 కేసులు, 582 మరణాలు!
Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..
Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.ఇప్పటికే తొమ్మిది లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 29,429 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,36,181 కి చేరుకుంది. ఇక గడిచిన24 గంటల్లో 582 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,309 కి చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,19, 840 కాగా, 5,90,032 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 63.92శాతం, మరణాల రేటు 2.61శాతంగా ఉన్నాయి.
కరోనా వ్యాప్తి తగ్గుతుంది : కేంద్రం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని, 10 లక్షల మందిలో 657 కేసులు మాత్రమే నమోదు అవుతున్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.7 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని స్పష్టం చేశారు.. ఇందులో 86% కేసులు కేవలం 10 రాష్ట్రాలలోనే నమోదు అవుతున్నట్టుగా ఆయన తెలిపారు.
ఇందులో 50 శాతం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉన్నాయని, మిగతా 36% కేసులు ఎనమిది రాష్ట్రాలలోనే ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా 20 రాష్ట్రాలలో కరోనా రికవరీ రేటు జాతీయ రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా వెల్లడించారు. అందులో ఉత్తర ప్రదేశ్ రికవరీ రేటు 64%, ఒడిశా 67%, అస్సాం 65%, గుజరాత్ 70%, తమిళనాడు రికవరీ రేటు 65% గా ఉన్నట్టుగా వెల్లడించారు. మే 2 నుంచి మే 30 వరకు దేశంలో కరోనా కేసులు రికవరీ కేసుల కంటే అధికంగా ఉండేవని, కానీ ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని వివరించారు.